అంకితభావంతో పని చేయండి


Wed,November 6, 2019 11:14 PM

పెద్దశంకరంపేట : ఉమ్మడి మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గానికి అత్యధికంగా 250 మంది నూతన టీచర్ల నియామకం జరిగిందని, నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిలో పీఆర్‌టీయూ సంఘం కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో విద్యాబోధన ఉందన్నారు.

పీఆర్‌టీయూ మండల మాస సంచిక విడుదల
పెద్దశంకరంపేట మండల పీఆర్‌టీయూ మాస సంచికను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం నూతనంగా పేట మండలానికి వచ్చిన 27 మంది ఉపాధ్యాయులకు ఐడీ కార్డులను అందజేశారు. రాఘవానితండా పాఠశాల 161వ జాతీయ రహదారి విస్తరణలో పోతున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉన్నదని పీఆర్‌టీయూ నాయకులు తెలుపగా మిషన్ భగీరథ కనెక్షన్లు ఇప్పించి, సంపులు నిర్మించేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అసూరి మురళీపంతులు, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు రామచంద్రచారి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కేవీ రవీందర్, పోమ్యానాయక్, జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఎంఈవో పోచయ్య, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, ఎంపీటీసీలు సుభాశ్‌గౌడ్, సురేశ్‌గౌడ్, దామోదర్, రాజేశ్, సర్పంచులు నరేశ్, సుధాకర్, పీఆర్‌టీయూ నాయకులు రఘునాథ్‌రావు, ప్రసన్న, సంతోశ్, తదితరులు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...