సేవా దృక్పథం అలవర్చుకోవాలి


Wed,November 6, 2019 01:21 AM

సంగారెడ్డి చౌరస్తా : విద్యార్థి దశ నుంచే సమాజంపై అవగాహన, సేవా దృక్పథం అలవర్చుకోవాలని కలెక్టర్‌ హనుమంతరావు యువతకు పిలుపునిచ్చారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నదని, అందులో 18నుంచి 30 ఏండ్ల లోపు యువత సభ్యత్వ నమోదు చేసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరా రు. గవర్నర్‌ కూడా యువత సంఘ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలని ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెడ్‌ క్రాస్‌ సంస్థ సభ్యత్వ నమోదు సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మానవత్వం నిష్పక్షపాతం, ఐకమత్యం, సేవాభావంతో సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో రెడ్‌ క్రాస్‌ కమిటీలో 18 నుంచి 30 ఏండ్ల లోపు వారిని యూత్‌ రెడ్‌ క్రాస్‌ కమిటీలో పెద్దఎత్తున ఉద్యమంలా సభ్యత్వ నమోదు చేయాలని డీఈవో, ఇంటర్మీడియట్‌ అధికారికి సూచించారు. జానియర్‌ రెడ్‌ క్రాస్‌ కమిటీలో వార్షిక సభ్యత్వానికి ప్రతి విద్యార్థి రూ.20 చెల్లించాలని, సంస్థ రూ.300 చెల్లించాలని, యూత్‌ క్రాస్‌ కమిటీలో అయితే ప్రతి విద్యార్థి రూ.40 చెల్లించాలని, సంస్థ రూ.400 సభ్యత్వ రుసుం చెల్లించాలని తెలిపారు. ఈ విధంగా చెల్లించిన ప్రభుత్వ రుసుంతో 85శాతం ఆ సంస్థకే రెడ్‌ క్రాస్‌ సంస్థ కార్యకలాపాలు నిర్వహించడానికి తిరిగి చెల్లించడం జరుగుతుదన్నారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 7నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో సభ్యత్వ నమోదు చేయించేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ చదివే విద్యార్థులు కూడా రెడ్‌క్రాస్‌ సంస్థలో సభ్యత్వ నమోదు చేయించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారికి సూచించారు. జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలలు, గీతం, ఎంఎన్‌ఆర్‌, ఐఐటీ వంటి పెద్దపెద్ద కళాశాలల్లో యువతకు సేవా దృక్పథంపై అవగాహన కలిగించి పెద్దసంఖ్యలో సభ్యత్వం తీసుకునేలా చూడాలని రెడ్‌ క్రాస్‌ సంస్థ చైర్మన్‌ వనజారెడ్డికి సూచించారు. సభ్యత్వ నమోదు ప్రాధాన్యం కాదని, ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా సామాజిక సేవపై మంచి దృక్పథం రావాలనే ఆశయంతో పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ఐడీ కార్డు ఇవ్వాలన్నారు. ఈ ఆశయ సాధనకు రెడ్‌ క్రాస్‌ సంస్థకు అవసరమైన యువతను సపోర్టుగా పంపాలని జిల్లా యువజన క్రీడల అధికారికి సూచించారు. ఇదంతా పద్ధతి ప్రకారం చేస్తే జిల్లా అంతటా వారం రోజుల లోగా సభ్యత్వ నమోదు చేయవచ్చని తెలిపారు. సభ్యత్వ నమోదు చేయడమే కాదు ప్రతి సంవత్సరం రెన్యువల్‌ అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని కలెక్టర్‌ పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి, డీఐవో, జిల్లా యువజన క్రీడల అధికారి రామచందర్‌రావు, రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ వనజారెడ్డి, ఆర్డినేటర్‌ రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...