పల్లె ప్రగతి నిరంతరంగా కొనసాగించాలి


Mon,November 4, 2019 10:56 PM

రాయికోడ్:ప్రభుత్వం చేపట్టిన 30రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయని ఎంపీడీవో స్టీవేన్‌నీల్ తెలిపారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో 30రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రణాళికలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయం తో పనిచేసి గ్రామాల రూపురేఖలనే మార్చేశారని తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించాలని చెప్పా రు. గడువులోగా గ్రామాల్లో డంపు యా ర్డులు, వైకుంఠధామాలు, ఇంకుడుగుంతల నిర్మాణం పనులు పూర్తిచేయాలని తెలిపారు.

గ్రామాల్లో ఉపాధిహామీ పని చేయించాలని, నిధుల కొరత లేదని వివరించారు. వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. ప్రతి గ్రామంలో 200 మంది యువతను నమోదు చేయాలని సూచించారు. మండల, గ్రామస్థాయి అధికారులు మూడు టీంలుగా ఏర్పడి ప్రతి బుధవారం పల్లె ప్రగతి పనులు పరిశీలిస్తారని ఆయన తెలిపారు. సమావేశంలో మండల పంచాయతీ అధికారి శ్రీకాంత్‌గౌడ్, మండల ఉపాధిహామీ అధికారి గురుపాదం, అధికారులు విష్ణు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...