రుణాలను సకాలంలో చెల్లించాలి


Mon,November 4, 2019 10:56 PM

రాయికోడ్ : మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వ అందిస్తున్న రాయితీలను పొందాలని ఐకేపీ డీపీఎం కొమురయ్య అన్నారు. ప్రతి గ్రామ సమైఖ్య సంఘాల సభ్యులు ఎలాంటి షరుతులు లేకుండా స్త్రీనిధి బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఉన్న ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సమైఖ్య సంఘాల సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడూతూ మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో విరివిగా స్త్రీనిధి బ్యాంకులో పొదుపులు చేసుకుని అధికంగా బ్యాంకు రుణాలను పొందాలన్నారు. గ్రామాల్లో ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా సభ్యులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ప్రసుత్తం మండలంలోని వివిధ గ్రామాల్లో 731ఎస్‌హెచ్‌జీ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లోని ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ప్రభు త్వం మహిళా సంఘాల అభివృద్ధికి 2019 సంవత్సరానికి రూ.12 కోట్ల నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. మండలంలో ఇప్పటి వరకు రూ.3 కోట్ల రూణాలను వడ్డీ లేకుండా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఏపీఎం నర్సింహులు, మండల సమైఖ్య అధ్యక్షురాలు శివలీల, సిబ్బంది నాగామణి, గాయప్ప, లింగమూర్తి, భార్గవి, రమేశ్, నర్సింహులు, సమదాన, శివయ్య, యశ్వంత్‌రావుపాటిల్ పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...