హత్నూర మండలానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవాలి


Mon,November 4, 2019 10:56 PM

-సమీక్ష సమావేశంలో ఎంపీపీ, జడ్పీటీసీ
హత్నూర : ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల గ్రామాభివృద్ధి పనులను పకడ్బందీగా చేపట్టి మండలానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి అన్నిశాఖల అధికారులు కృషిచేయాలని ఎంపీపీ వావిలాల నర్సింహులు, జడ్పీటీసీ పొట్లచెర్వు ఆంజనేయులు తెలిపారు. సోమవారం హత్నూర ఐకేపీ సమావేశ మందిరంలో పలు ప్రభుత్వశాఖల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో 30రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులను నిరంతరాయంగా చేపట్టడంతోపాటు మిగిలి ఉన్న పనులల్లో వేగం పెంచి పూర్తిచేయాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, డంపుయార్డులు, శ్మశానవాటికలు, ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టడంతోపాటు పారిశుధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీవో సువర్ణ, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, సూపరింటెండెంట్ శ్రీధర్‌తోపాటు ఆయా గ్రామాల కార్యదర్శులు, ప్రభుత్వశాఖల సిబ్బంది పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...