కొనసాగుతున్న రైతునేస్తం


Mon,November 4, 2019 10:54 PM

అందోల్, నమస్తే తెలంగాణ: రైతులు పండించిన పంటలను పరిశీలించి, వారి సమస్యలను నమోదు చేసుకుని, పరిష్కరించేందుకు ప్రభు త్వం రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, ఏఈవోల ద్వారా రైతుల వివరాలను సేకరణ ప్రారంభమైందని జోగిపేట వ్యవసాయ శాఖ ఏడీఏ అరుణ తెలిపారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని అల్మాయిపేట, కన్‌సాన్‌పల్లి, నాదులాపూర్ గ్రామాల్లో అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె నాదులాపూర్‌లో చేపడుతున్న రైతునేస్తం కార్యక్రమాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏఈవోలు శ్రీనివాస్, శ్రీకర్, యశస్వీని ఉన్నారు.

వట్‌పల్లిలో..
వట్‌పల్లి: రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా అధికారులు రైతుల పంట పొలాలను పరిశీలించి తగు సూచనలు చేస్తున్నారు. సోమవారం వట్‌పల్లి, గొర్రెకల్ గ్రామాల్లో పత్తి పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మహేశ్‌చౌహన్ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా రైతునేస్తం కార్యక్రమం కొనసాగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈవో సవిత, రైతులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...