ఆలయాల్లో భక్తుల సందడి


Mon,November 4, 2019 10:54 PM

గుమ్మడిదల : కార్తిక సోమవారం పురస్కరించుకుని మండలంలోని బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా వీరభద్రస్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలతోపాటు కుంకుమార్చన చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈవో శిశధర్ గుప్తా, సూపరింటెండెంట్ మఠం వీరేశం, సోమయ్య పర్యవేక్షించారు. కాగా బొంతపల్లిలో భవానీ ప్రభులింగేశ్వరస్వామి ఆలయంలో మహిళలు సామూహికంగా కార్తిక దీపాలను వెలగించారు.

బీరంగూడలో..
అమీన్‌పూర్ : మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం కార్తిక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో గర్భగుడిలో అభిషేకం నిర్వహించారు. అంతేకాకుండా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రమిదలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

7 నుంచి ఓంకారేశ్వరాలయంలో పూజలు
సంగారెడ్డి మున్సిపాలిటీ : కార్తిక మాసం లో వెలిగే దీపాల వల్ల సర్వపాపాలు తొ లిగించబడుతతాయని కోహీర్ ఓంకారేశ్వరరాలయ పీఠాధిపతి సద్గురు దక్ష్మిణామూర్తి పేర్కొన్నారు. సోమవారం స్థాని క శ్రీనగర్ కాలనీలోని విఠలేశ్వరాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన స త్సంగం లో పాల్గొని యన మాట్లాడారు. తసత్యధ ర్మ శాంతి ప్రేమలతో జీవన యాత్ర సాగించాలన్నారు. సద్గురు దీక్షితలులు ఈ నెల 7 నుంచి 12 వరకు కోహీర్ ఓంకారేశ్వరాలయంలో నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో భక్తులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...