ఎమ్మెల్యే చొరవతో చకచకా రోడ్డు పనులు


Sun,November 3, 2019 11:07 PM

మునిపల్లి: మండల కేంద్రం మునిపల్లికి వెళ్లే ఏకైక రోడ్డు బుధేరా రోడ్డే. బుధేరా చౌరస్తా నుంచి మునిపల్లి వరకు నూతంగా నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులకు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయి. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి బుధేరా-మునిపల్లి రోడ్డు త్వరలో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించడంతో అధికారులు, కాంట్రక్టర్లు రోడ్డు నిర్మాణం పనుల్లో వేగం పెంచారు. దీంతో రోడ్డు పనులు చకచకా జరుగుతున్నాయని మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మండలంలో పర్యటించిన సందర్భంగా రోడ్డు పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోండి సార్ అంటూ మండల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందనతోనే బుధేరా-మునిపల్లి రోడ్డు పనులు పూర్తి అవుతున్నాయని మండల ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...