అన్ని రాష్ర్టాల ప్రజలను గౌరవిస్తాం


Sun,November 3, 2019 11:07 PM

పటాన్‌చెరు, నమస్తేతెలంగాణ: తెలంగాణలో ఉన్న అన్ని రాష్ర్టాల ప్రజలను గౌరవిస్తామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి పటాన్‌చెరు పట్టణంలో ఛట్ పండుగ సందర్భంగా సాకి చెరువు వద్ద పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన ప్రజలు ఛట్ పండుగను సాంప్రదాయంతో చేస్తారు. ఈ మేరకు చెరువు వద్ద ఛట్ పండుగ సంబురాలను ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఛట్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో 28 రాష్ర్టాల ప్రజలు పటాన్‌చెరు ప్రాంతంలో నివసిస్తున్నారని చెప్పారు. దేశంలో ఉన్న భిన్నమైన సంస్కృతులు, పండుగలు పటాన్‌చెరులో జరుగుతుండడం సంతోషకరమన్నారు. పటాన్‌చెరును మినీ ఇండియా అని పిలుస్తున్నారని తెలిపారు. భిన్నమైన సంస్కృతి సాం ప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పరిశ్రమల్లో ఉపాధికోసం వస్తున్న అన్ని రాష్ర్టాల ప్రజలకు ఏ సమస్య వచ్చిన అండగా నిలుస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. పండుగలను మరింత ఘనంగా జరిపేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో శ్రీధర్‌చారి, మెట్టు కుమార్ యాదవ్, నాగేశ్, విజయ్‌కుమార్, గూడెం మధుసూదన్‌రెడ్డి, పలు రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...