భక్తజన సంద్రం.. మల్లన్న క్షేత్రం


Sun,November 3, 2019 11:07 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సందడి నెలకొంది. శనివారం రాత్రే భక్తులు క్షేత్రానికి చేరుకొని, ఆదివారం వేకువజామున పుష్కరిణిలో స్నానాలు చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకోవడంతో పాటు కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. వివిధ జిల్లాల నుంచి స్వామి వారి దర్శనం కోసం 10వేల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చినట్లు ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్ తెలిపారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ఆయనతో ఆలయ ఏఈవో రావుల సుదర్శన్, పర్యవేక్షకుడు నీల శేఖర్, సిబ్బంది బత్తిని పోచయ్య, మేకల పోచయ్య, బ్రహ్మాండ్లపల్లి అంజయ్య, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సార్ల విజయ్‌కుమార్, నర్సింహులు, మాధవి, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...