ఆధ్యాత్మిక క్షేత్రంగా బీరంగూడ


Sun,November 3, 2019 11:06 PM

-ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
అమీన్‌పూర్: మండలంలోని బీరంగూడ గొప్ప ఆధ్యాత్మిక ప్రాంతంగా మారుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున ఆలయం సమీపంలో దాతల సహాయంతో రూ.60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న భారీ శివపార్వతుల విగ్రహాల నిర్మాణ పనులకు, ఒక్కో దానికి రూ.2 కోట్ల వ్యయంతో మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీకృష్ణుడి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, మార్కండేయ ఆలయం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, శ్రీకన్యకా పరమేశ్వరీ ఆలయం, ఆలయ సత్రాల నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీరంగూడలో ఆయా వర్గాలకు చెందిన ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆలయాలను నిర్మించడం జరుగుతుందన్నారు. అందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో వాటర్ వర్క్స్ కమిషనర్ దాన కిషోర్, కలెక్టర్ హనుమంతరావు, జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి , ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, ఆర్డీవో శ్రీను, డీఎస్పీ రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, అమీన్‌పూర్ ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పానగేశ్ యాదవ్, కార్పొరేటర్లు సిందూఆదర్శ్‌రెడ్డి, అంజయ్య యాదవ్, గుమ్మడిదల జడ్పీటీసీ కుమార్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకుడు, టీఆర్‌ఎస్ మాజీ మండల అద్యక్షుడు తుమ్మల పాండురంగారెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు తులసిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు కొల్లూరు మల్లేశ్, కవితా శ్రీనివాస్‌రెడ్డి, అనిల్, అన్వరున్నీసా బేగం, యూనుస్, కాలప్ప, ఆసిఫ్, చంద్రారెడ్డి, సోమిరెడ్డి, గడీల కుమార్‌గౌడ్, బాలరాజు, సర్పంచ్‌లు ఏర్పుల కృష్ణ, భాస్కర్‌గౌడ్, లలితామల్లేశ్, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, తలారి రాములు, సీఐలు ప్రభాకర్, రామిరెడ్డి, లాలునాయక్, ప్రశాంత్, తహసీల్దార్ స్వామి, మున్సిపల్ కమిషనర్ వేమనరెడ్డి, వాటర్‌వర్క్స్ అధికారులు కృష్ణారెడ్డి, శంకర్, హనుమంతు, జిన్నారం ఎంపీటీసీ వెంకటేశంగౌడ్ పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...