పంట పొలాల్లో వ్యవసాయ అధికారులు


Sat,November 2, 2019 11:04 PM

వట్‌పల్లి: పత్తి పంటను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశామని ఏవో మహేశ్ చౌహాన్ తెలిపారు. శనివారం మండలంలోని దుద్యాలలో పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతుల పంట పొలాలను పరిశీలించి అధిక దిగుబడి కోసం అనుసరించాల్సిన విధి..విధానాలను తెలియజేస్తున్నామన్నారు. రైతులకు ఎలాంటి సహాయం అవసరమైన తమ సిబ్బంది ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని వారి సేవలను రైతులు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో సవిత, సర్పంచ్ శంకరప్ప, రైతులు పాల్గొన్నారు.

మునిపల్లిలో..
మునిపల్లి: మండలంలోని హైదలాపూర్‌లో పత్తి పంటలను శనివారం వ్యవసాయ శాఖ ఏడీ అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట సాగు చేసిన రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు,సూచనలతో అధిక దిగుబడులు సాధించడానికి కృషి చేయాలన్నారు. కాగా పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు కురుస్తుండడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తగు జాగ్రత్తలు తీసుకుంటే నష్టపోకుండా ఉంటారని పేర్కొన్నారు.

రాయికోడ్‌లో..
రాయికోడ్: మండల పరిధిలోని కోడూర్, ఉల్గెరా గ్రామాల్లో శనివారం వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సహాయ సంచాలకురాలు హరిత మాట్లాడుతూ రైతులతో ముఖముఖి నిర్వహించి నేరుగా పంటలను సందర్శించి పలు రకాల సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు. అలాగే పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు పంటలపై యాజమాన్య పద్ధతులు, ఎరువులు ఎంతో మోతాదులో వాడాలో వివరించారు. వరికోతల అనంతరం ఉండవలసిన తేమశాతం, హార్టికల్చర్‌లో వివిధ పథకాల ద్వారా సబ్సిడీలో ఉన్న వాటిపై అవగాహన కల్పించామన్నారు. పత్తికి బీమా చెల్లించిన రైతులకు నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అవినాశ్‌వర్మ, సర్పంచ్ శంకర్, రైతులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...