వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి


Sat,November 2, 2019 11:04 PM

అందోల్, నమస్తేతెలంగాణ: మండలంలోని అక్సాన్‌పల్లిలో శనివారం వైద్య శిబిరం నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు అందజేశామని జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదీరాబాద్ రమేశ్ తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధలు పాల్గొన్నారు.

హత్నూరలో..
హత్నూర: పేద ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య చికిత్స సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు నాగజ్యోతి అన్నారు. శనివారం మండలంలోని నవాబుపేటలో ప్రజా ఆరోగ్య వేదికలో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం పలువురికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కాగా, గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకుని మందులు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశంతో పాటు వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

తక్కడపల్లిలో వైద్య శిబిరం
మునిపల్లి: మండలంలోని తక్కడపల్లిలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీపీ శైలజాశివశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం గ్రామాల్లో ప్రజా ఆరోగ్య వేదికల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే వైద్య శిబిరాల్లో ప్రజలు పాల్గొని చికిత్సలు చేయించుకోవాలన్నారు. కాగా టీజీఎస్ అధ్యక్షుడు నజీర్‌సర్దార్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు దోమతెరలు అందజేశారు. కార్యక్రమంలో వైద్యురాలు శిరీష, ఏఎన్‌ఎం సుజాతతోపాటు పలువురు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...