నూతన ఉపాధ్యాయులకు సన్మానం


Sat,November 2, 2019 11:03 PM

వట్‌పల్లి: సమాజంలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి దేశానికి ఎంతో మంది ప్రముఖులను తయారు చేసిన ఘనత వారికే దక్కుతుందని పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు సిద్ధేశ్వర్‌గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రం వట్‌పల్లిలో కొత్తగా విధుల్లో చేరిన 14మంది ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి గొప్పదన్నారు. భావితరాలకు సేవలందించేందుకు వెళ్లే ప్రతి ఒక్కరూ వివిధ పాఠశాలలో చదివి వెళ్లినవారేనన్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికీ అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి వారిని పోత్సహిస్తే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గురువును మర్చిపోరని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఏర్పడిన ప్రెస్‌క్లబ్ సభ్యులను పీఆర్‌టీయూ తరఫున సన్మానించగా.. పీఆర్‌టీయూ అధ్యక్ష, కార్యదర్శులను ప్రెస్‌క్లబ్ బాధ్యులు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, రాష్ట్ర బాధ్యులు నవీన్‌కుమార్‌గౌడ్, రాంరెడ్డి, నర్సింహులు, జిల్లా బాధ్యులు సత్యనారాయణ, సుధాకర్, ఉపాధ్యాయులు బాలయ్య, సంగయ్య, వీరన్న, సంతోశ్, రవీందర్, గణేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...