డంపుయార్డు నిర్మాణ పనులు ప్రారంభం


Sat,November 2, 2019 11:03 PM

హత్నూర: మండలంలోని గోవిందరాజ్‌పల్లిలో శనివారం డంపుయార్డు నిర్మాణ పనులను ప్రారంభించినట్లు సర్పంచ్ సునీతరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామశివారులో డంపుయార్డు నిర్మాణానికి రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించడంతో నిర్మాణం పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. డంపుయార్డు నిర్మాణం పనులు పూర్తయితే గ్రామస్తులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాణిక్యం, టీఏ రాజేశ్వరి, ఫీల్డ్ అసిస్టెంట్ ముత్తయ్య, వార్డు సభ్యుడు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...