సంగాయిపేటలో జోరుగా శ్రమదానం


Mon,October 21, 2019 11:15 PM

కొల్చారం: మండల పరిధిలోని సంగాయిపేటలో గ్రామస్తులు సోమవారం శ్రమదానం చేశారు. పల్లె ప్రగతిలో ఊరంతా సుమారుగా 4000 మొక్కలు నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. అలాగే స్వచ్ఛ సంగాయిపేటలో భాగంగా గత రెండు వారాలుగా ఊరంతా పారిశుద్ధ్య పనుల్లో వీధులను శుభ్రం చేశారు. మురికి కాల్వలు శుభ్రం చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేశారు. గ్రామస్తులంతా స్వచ్ఛందంగా వీధుల్లో నాటిన మొక్కల చుట్టూర పెరిగిన కలుపుమొక్కలను సోమవారం తొలగించారు. అలాగే మొక్కలకు అమర్చిన ట్రీగార్డులు పడిపోగా సరిచేశారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొనడం పట్ల గ్రామసర్పంచ్ మానస శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles