కూరగాయల మినీకిట్ పంపిణీ


Mon,October 21, 2019 11:14 PM

చిలిపిచెడ్ : మండల పరిధిలోని గూజిరి తండాల్లోని రైతులకు మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి స్రవంతి కూరగాయ విత్తనాలు పంపిణీ చేశారు. సోమవారం తండాల్లోని పంచాయతీ పరిధిలోని 10 మంది రైతులకు కూరగాయ విత్తనాలు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు మినీకిట్ కూరగాయలు బీరకాయ, సోరకాయ, కాకరకాయ, పాలకూర, తోటకూర ఐదు రకాల కూరగాయల విత్తనాలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మినీకిట్ కూరగాయలు 0.1గుంటకు వస్తుందన్నారు. కార్యక్రమంలో తండా సర్పంచ్ రాకేశ్‌నాయక్, రైతులు గోవింద్‌నాయక్, మోత్యానాయక్ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...