పౌష్టికాహారంతోనే ఆరోగ్యం


Mon,October 21, 2019 11:14 PM

కొల్చారం: తల్లీబిడ్డ ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని రంగంపేట ప్రాథమిక వైద్య కేంద్రం సీహెచ్‌వో (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్) సుదర్శన్ తెలిపారు. సోమవారం వివిధ చికిత్సల నిమిత్తం వచ్చిన గర్భిణులకు అయోడిన్ ఉప్పు ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న 1000 రోజుల పోషణ్ అభియాన్ కార్యక్రమం గురించి వివరించారు. పౌష్టికాహారం లోపంతో రక్తహీనత వస్తుందన్నారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ సూచనల చేశారు. అలాగే కూరగాయలు, ఆకుకూరలతో పాటు అంగన్‌వాడీలో ఇచ్చే పాలు, గుడ్డు, ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అయోడిన్ లోపంతో సమస్యలు..
నర్సాపూర్ రూరల్ : మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సోమవారం పీహెచ్‌సీ వైద్యురాలు విజేత ఆధ్వర్యంలో ప్రపంచ అయోడిన్ అవగాహన దినోత్స వ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు విజేత మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అయోడిన కలిగిఉన్న ఉప్పును మాత్రమే వాడాలని సూచించారు. అయోడిన్ లోపం వలన మంద బుద్ది, గొంతునొప్పి, థైరాయిడ్ తదితర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో లక్ష్మి, సూపర్‌వైజర్ ప్రమీల రాణి, స్టాప్ నర్స్‌లు లావణ్య, సంతోష, ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది చందు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...