తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలి


Mon,October 21, 2019 11:13 PM

సంగారెడ్డి టౌన్ : ప్రేమ వివాహం చేసుకున్నందుకు తమను తల్లిదండ్రులు బెదిరింపులకు గురి చేస్తున్నారని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి రక్షణ కల్పించాలని సదాశివపేట మండలానికి చెందిన ఓ ప్రేమజంట ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. సోమవారం నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్‌డేలో పలు ఫిర్యాదులు అందాయి.
-కులాంతర వివాహం చేసుకున్నామని తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్ల తమ ఇష్టంతోనే వివాహం చేసుకున్నందు వల్ల తమ తల్లిదండ్రుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి న్యాయం చేయాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

-తనకు పెళ్లి జరిగి 20ఏండ్లు అవుతుందని పెళ్లి జరిగిన సంవత్సరం నుంచి తన భర్త మద్యం సేవించి తనపై లేనిపోని నిందలు వేస్తూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని, పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినప్పటికీ తన భర్తలో ఎటువంటి మార్పు రాలేదని, తనకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని కంది మండలానికి చెందిన ఓ ఫిర్యాదురాలు ఎస్పీకి వినతి పత్రం అందజేశారు.

-తాను సంగారెడ్డి మండలంలో 2016సంవత్సరంలో ప్లాటు కొనుక్కున్నానని, ఆ ప్లాట్‌లో ప్రస్తుతం ఇల్లు నిర్మించుకుందామని వెళ్లగా అక్కడ తన స్థలంలో వేరొక వ్యక్తి అతడి పేరుపై ఉన్న బోర్డును నాటాడని, ఆ వ్యక్తిని అడిగితే ఆ స్థలం తనదని చెప్పినా పట్టించుకోవడం లేదని, ప్లాట్‌ను ఆక్రమించుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ వాటిని పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...