ప్రయాణం ప్రశాంతం..


Sun,October 20, 2019 11:39 PM

-మెదక్ రీజియన్‌లో తిరిగిన 524 బస్సులు
-జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఆర్టీసీ బస్సులు
-ఉమ్మడి జిల్లాలో అన్ని రూట్లలో కొనసాగిన ఆర్టీసీ సర్వీసులు

సంగారెడ్డి టౌన్ : మెదక్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ బస్సులు యధేచ్ఛగా సేవలందించాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 626ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ఉండగా అందులో 524బస్సులు ప్రజలకు సేవలందించాయి. ఆర్టీసీ-366, ప్రైవేట్-158 బస్సులు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని రూట్లలో సేవలందించాయి. ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 16రోజులు గడుస్తున్నా ప్రజలకు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నామ మార్గాల ద్వారా బస్సులను తిప్పుతూ ప్రజలకు సేవలందిస్తున్నారు. తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్, కండక్టర్లను నియమించి ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని రూట్లలో బస్సులను తిప్పారు. కాగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా ప్రధాన కూడళ్ల వద్ద నిలబడి పూలు అందిస్తూ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఉమ్మడి జిల్లాలో మారుమూల ప్రాంతాలకు బస్సులు..
ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రీజియన్ పరిధిలో మారుమూల ప్రాంతాలకు సైతం బస్సులను తిప్పారు. ఉదయం 5.00గంటల నుంచే వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేశారు. ఎక్కడా కూడా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఆదివారం ఉమ్మడి జిల్లా పరిధిలో 524 బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చారు. 366 ఆర్టీసీ బస్సులు, 158 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. మెదక్ రీజియన్ పరిధిలోని అన్ని మారుమూల ప్రాంతాలకు సైతం అధికారులు బస్సులను నడిపారు. రీజియన్‌లోని 8డిపోల పరిధిలో మెదక్ డిపోలో 96 బస్సులు ఉండగా ఆర్టీసీ 47, ప్రైవేట్ 32 బస్సులు తిరిగాయి.

నారాయణఖేడ్ డిపోలో 55బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ-33, ప్రైవేట్-06 బస్సులను తిప్పారు. సంగారెడ్డి డిపోలో 108 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ-73, ప్రైవేట్-27 బస్సులు ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. సిద్దిపేట డిపోలో 115బస్సులకు ఆర్టీసీ-55, ప్రైవేట్-34 బస్సులు తిరిగాయి. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో 68బస్సులకు ఆర్టీసీ-45, ప్రైవేట్-20 బస్సులు ప్రజలకు సేవలందించాయి. జహీరాబాద్ డిపోలో 90బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ-49, ప్రైవేట్-23 బస్సులు ప్రజలకు సేవలందించాయి. దుబ్బాక డిపోలో 40బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ-28, ప్రైవేట్-4 బస్సులు తిరిగాయి. హుస్నాబాద్ డిపోలో 54బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ-36, ప్రైవేట్-12 బస్సులు ప్రయాణికులకు సేవలు అందించాయి.

కార్మికుల వినూత్న నిరసనలు..
సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉమ్మడి జిల్లాలోని 8డిపోల ఎదుట కార్మికులు వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని డిపోల ఎదుట కార్మికులు ప్రధాన కూడళ్ల వద్ద నిలబడి ప్రజలకు పూలు అందజేస్తూ సమ్మెకు మద్దతు తెలుపాలని కోరారు. వివిధ సంఘాల నాయకులు వారికి పూర్తి మద్దతు ఇస్తున్నామని సమస్యలు పరిష్కరించాలని కోరారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...