గ్రామాల్లో జోరుగా యువ శ్రమదానం


Sun,October 20, 2019 11:35 PM

అందోల్ జోన్ బృందం: పల్లెల్లో శ్రమదానం పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పల్లెలను ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రణాళిక పనులతో పల్లెల రూపు రేఖలు మారాయి. ఈ పనులు నిరంతరంగా కొనసాగిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నేరవేరుతుంది. ఇందుకోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రణాళిక పనుల్లో యువకులు భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ హనుమంతరావు పిలుపు మేరకు ఆదివారం ఆయా గ్రామాల్లో చేపట్టిన యువ శ్రమదానం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీధులను శుభ్రం చేయడంతో పాటు చెత్తను ఏరివేయడం, పిచ్చి మొక్కలు, ముండ్ల పొదలను తొలిగించే పనుల్లో పాలుపంచుకున్నారు. అందోల్ నియోజకవర్గంలోని అందోల్‌తో పాటు రాయికోడ్, మునిపల్లి, పుల్కల్, వట్‌పల్లి, నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలాల్లోని ఆయా గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో యువకులు ముమ్మరంగా శ్రమదానం చేశారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...