కొనసాగుతున్న బస్సులు


Sun,October 20, 2019 11:35 PM

నారాయణఖేడ్ టౌన్ : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 15 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో నడిపిస్తుంది. నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో 63బస్సులు ఉండగా సుమారు 45బస్సులు ప్రజలకు సేవలందిస్తున్నాయని ఆర్టీసీ డీఎం మూర్తి తెలిపారు. నారాయణఖేడ్ మీదుగా పెద్దశంకరంపేట, జోగిపేట్, సంగారెడ్డి, పటాన్‌చెరు, సికింద్రాబాద్, వికారాబాద్, జహీరాబాద్, కంగ్టి, కల్హేర్, మనూరు, మెదక్, పిట్లం, తదితర గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడుపుతూ ప్రజలకు సేవలందిస్తున్నారు. దీంతో ప్రయాణికులు సైతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో 100శాతం బస్సులను నడిపేందుకు కృషి చేస్తున్నట్లు డీఎం తెలిపారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...