గ్రామాల్లో కేంద్ర జలశక్తి అభియాన్ బృందం పర్యటన


Sun,October 20, 2019 11:35 PM

న్యాల్‌కల్ : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం కేంద్ర జలశక్తి అభియాన్ బృందం సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని హుస్సేనగర్, అమీరాబాద్, డప్పూర్, శంశోల్లాపూర్, ఖలీల్‌పూర్ గ్రామాల్లో కేంద్ర జలశక్తి అభియాన్ అధికారి భీమ్‌సింగ్ రౌటలాగోల్, జిల్లా, మండల అధికారుల బృందం పర్యటించారు. ఆయా గ్రామాల్లోని చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలు, ఇంకుడు గుంతలు, కందకాలు, హరితహారం, రైతుల సాగు చేసిన పలు రకాల పంటలు, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించారు. మొక్కలు నాటడం, భూగర్భ జలాలను పెంపొందించేందుకు మండల అధికారులు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర జలశక్తి అభియాన్ అధికారి భీమ్‌సింగ్ రౌటలా గోల్ సంతృప్తి వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో డీఆర్‌డీవో శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీఏ అదనపు ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, రూరల్ డెవలప్‌మెంట్ జేఈఈ ఏక్బాల్ అహ్మద్, ఏబీఎం కోఆర్డినేటర్ స్వామి, ఎంపీడీవో సయ్యద్ ముజాఫర్‌షాఖాన్, ఏవో లావణ్య, ఈజీఎస్ ఏపీవో రంగారావు, ఇరిగేషన్ ఏఈ రవీందర్, ఏఈవో మహేశ్, సర్పంచ్‌లు రవికుమార్, శరణప్ప, జ్ఞానేశ్వర్, మీనాక్షీఈశ్వర్ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...