సంగమేశ్వర దేవాలయంలో భక్తుల పూజలు


Sun,October 20, 2019 11:35 PM

ఝరాసంగం : దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగాణం శివ నామస్మరణతో మారుమోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమృతగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి యజ్ఞ మంటపంలో పార్వతీసమేత సంగమేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు కుంకుమార్చన, రుద్రాభిషేకం, పాలాభిషేకంతోపాటు అన్నపూజ తదితర పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమృతగుండంలో జలలింగానికి పూజలు, ఆలయ ప్రాంగాణం చుట్టూ ప్రదక్షణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...