భూగర్భ జలాలను పెంపొందించాలి


Sat,October 19, 2019 11:35 PM

ఝరాసంగం : పల్లెల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములవ్వాలని జల శక్తి అభియాన్ బృందం సభ్యులు అశ్వినివర్మ, భీమ్‌సింగ్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని బర్దీపూర్, తుమ్మన్‌పల్లి, ఏడాకులపల్లి గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ పొలాల్లో రైతులు పండించిన అల్లం పంటతోపాటు పలు రకాల పంటలను, హరితహారం కింద నాటిన మొక్కలు, నీటి నిల్వ కుంటలను పరిశీలించారు. నాటిన మొక్కలను రక్షించే చర్యలు, వర్షం నీటి బొట్టు భూమిలో ఇంకిపోయే విధంగా చిన్న కుంటలు, చెక్‌డ్యాంల నిర్మాణాలను ఉపాధి కూలీలతో చేపట్టాలన్నారు. 30 రోజుల ప్రణాళికలో పేర్కొన్న అంశాలను ప్రతి రోజు నిర్వహిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. భూగర్భ జలాలు పెరుగాలంటే నీటిని నిల్వ చేసుకునే విధంగా పెద్ద ఎత్తున కందకాలు తవ్వి ఎక్కడి నీటిని అక్కడే నిల్వ చేసుకోవాలన్నారు. కందకాలను తవ్వడం వల్ల నీటి నిల్వలు పెరిగి భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కేంద్రం, రాష్ర్టాల సహకారంతో జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. భూగర్భ జలాలు పెరగడానికి నీటి వనరుల సంరక్షణ ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు. మొక్కలు నాటడం నీటి నిల్వలను పెంచడం, ఇతర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో శ్రీనివాస్‌రావు, వ్యవసాయశాఖ జేడీఏ నరసింహారావు, జిల్లా హార్టికల్చర్ అధికారి సునీత, జహీరాబాద్ ఏపీడీలు ఎల్లయ్య, రాజు, ఎంపీడీవో సుజాత, జేఈ ఇక్బాల్, ఉపాధి హామీ సిబ్బంది శ్యామయ్య, శంకర్‌రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు శివలక్ష్మీకృష్ణ, నవాజ్‌రెడ్డి, విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు ప్రభాకర్, కృష్ణ, ఇందిరా, మద్యపాన నిషేధ కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఎంత అందంగా ఉన్నానో..
గుమ్మడిదల: అద్దం కనిపించిందంటే చాలా మంది తన అందాలను చూసుకుని మురిసిపోతారు. అది కేవలం మనుషులే కాదు... అప్పుడప్పుడు పక్షులు, వానరాలు కూడా మురిసిపోతుంటాయి. ఇక్కడ అటువంటి సంఘటనే చోటు చేసుకున్నది. శనివారం గుమ్మడిదల మండల కేంద్రంలో పార్కింగ్ చేసిన బైక్ వద్దకు ఒక కొడముచ్చు వచ్చి బైక్‌కు ఉన్న అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోయింది. ఇది దాదాపు అరగంటకు పైగా అద్దంలో తనను తాను చూసుకోవడంతో చుట్టూ ఉన్న ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు. ఈ దృశ్యాన్ని నమస్తే తెలంగాణ క్లిక్ మనిపించింది.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...