చెరువు, కుంటలను అభివృద్ధి చేసుకుందాం


Sat,October 19, 2019 11:34 PM

జిన్నారం : నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను మరింత అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం అండూరులో రూ.18 లక్షల తో చేపట్టే గూడెం చెరువు నుంచి అండూరు చెరువుకు మధ్య ఉన్న కట్టు కాలువ మరమ్మతులు, రెండు కల్వర్టుల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలోని చెరువు, కుంటల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టి వాటిని బాగు చేశారన్నారు. కొన్ని గ్రామాల్లో మి షన్ కాకతీయ పనులు జరుగాల్సి ఉందన్నారు. ప్రతి వర్షం చినుకు చెరువులోకి చేరాలన్నారు. చెరువు నుంచి నీరు పం ట పొలాలకు నీరు పారాలన్నారు. ఇందుకోసమే అండూరులో ఉన్న కట్టు కాలువకు మరమ్మతు పనులు ప్రారంభించామన్నారు. అలాగే గ్రామంలో రెండు కల్వర్టులను నిర్మిస్తున్నామన్నారు. మండలంలోని గ్రామాల్లో అవసరమైన చెరువులకు కట్టు కాలువలు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంతో చెరువు, కుంటలను బాగు చేయడమే కాకుండా రైతుల కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ఎకరాకు రూ.5 వేలు రెండు పంటలకు ఇస్తున్నదన్నారు. వ్యవసాయ సాగుకు రైతులు అప్పులు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం సాయం అందిస్తున్నదన్నారు. గ్రామాల్లో రైతులు వ్యవసాయ సాగును పెంచడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చేస్తామన్నారు. ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నది మా ధ్యేయమన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కె.ప్రభాకర్, టీఆర్‌ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, అండూరు సర్పంచ్ ఖదీర్, ఎంపీటీసీ స్వాతిప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, నాయకులు కృష్ణాగౌడ్, పంతులు సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, సార నరేందర్, నక్క నాగరాజు, రామక్రిష్ణ, గోపాల్‌రెడ్డి, వెంకటేశ్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...