బంద్ ప్రశాంతం


Sat,October 19, 2019 11:34 PM

సంగారెడ్డి మున్సిపాలిటీ: ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఎక్కడ చిన్న పాటి సంఘటన చోటు చేసుకోలేదు. కాగా, రహదారులపై ఆందోళన చేసిన రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మధ్యాహ్నాం వరకు బస్సులు డిపోలకు పరిమితం కాగా, ప్రైవేటు వాహనాలు ప్రయాణికులను చేరవేయడం కనిపించింది. అక్కడక్కడ ఆర్టీసీ బస్సులు కూడా రొడ్డెక్కాయి. మొత్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు చర్యలు చేపట్టారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్‌చెరు, అందోల్ నియోజకర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, ర్యాలీలు నిర్వహించారు. పటాన్‌చెరు పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు అన్ని షిఫ్టులు నడిచాయి. కొన్ని చోట్ల బంద్ నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులు వారిని రోడ్డుకు అడ్డుగా పక్కకు జరుపడంతో వాహనాల్లోని కార్మికులు పరిశ్రమలకు వెళ్లారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...