తుపాకీ కలిగిన వ్యక్తుల అరెస్టు


Sat,October 19, 2019 11:34 PM

సంగారెడ్డి మున్సిపాలిటీ: చట్ట విరుద్ధంగా తుపాకీ (పిస్తోల్) కలిగి ఉన్న వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో పరిచామని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం పట్టణంలోని బైపాస్ రోడ్డు మహిళా ప్రాంగణం ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మధ్యాహ్నం 3గంటల సమయంలో పట్టణంలోకి వస్తున్న షిఫ్ట్ డిజైర్ కారు నెంబర్ టీఎస్ 26బి5364ను ఆపి తనిఖీ చేయగా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించి తనిఖీ చేయగా ఎలాంటి లైసెన్స్ లేకుండా చట్ట విరుద్ధంగా ఒకరి వద్ద 7.65 పిస్తోల్, మ్యాగ్జిన్ మరొక వ్యక్తి వద్ద ఐదు బుల్లెట్లు, ఒక మ్యాగ్జిన్ కలిగి ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి పేర్లు సింగిరెడ్డి నరోత్తంరెడ్డి (36) కరీంనగర్ జిల్లా, నర్సింగాపూర్, నేర్పటి కుమారస్వామి అలియాజ్ కుమా ర్, ప్రభాస్ (30) జయశంకర్ భూపాపల్లి జిల్లా, ఇస్సిపేట్‌కు చెందిన వారీగా గుర్తించామన్నారు. ప్రస్తుతం వారు వరంగల్ అర్బన్ జిల్లా, గోపాలపూర్ కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉం టున్నారని చెప్పారు. మొండి బకాయిలు వసూలు చేయమని వారి వద్దకు వచ్చే వారి కోసం బెదిరించి డబ్బులు వసూలు చేసి వారికి ఇచ్చి, దొంగతనాలు, దోపిడీలు చేసి డబ్బులు సంపాదించాలని బీహార్ రాష్ట్రంలో గోలుసింగ్ అనే వ్యక్తి వద్ద రూ. 45 వేలకు పిస్తోల్ కొన్నారని తెలిపారు. హైదరాబాద్ చుట్టు పక్కల బెదిరించి దొంగతనం చేసి పారిపోయేందుకు హన్మకొండలో కారు కిరాయికి మాట్లాడుకుని వస్తున్నట్లు పేర్కొన్నారు. సింగిరెడ్డి నరోత్తంరెడ్డిపై కరీంనగర్, హుస్నాబాద్, వీణవంక, రేగుండ, ముల్కనూర్, ఆచారం పోలీసు స్టేషన్లలో మొత్తం 9 కేసులు ఉన్నాయి. ఇతను గతంలో కూడా రెండు తుపాకీలు తీసుకొచ్చి వాటితో నేరాలు చేసి పట్టుబడ్డాడు. నేర్పటి కుమారస్వామి అలియాస్ కుమార్, ప్రభాస్‌పై వీణవంక పోలీసు స్టేషన్‌లో హత్య కేసు, జమ్మికుంట పోలీసు స్టేషన్‌లో కుట్ర కేసు ఉన్నాయి. వారి వద్ద ఉన్న ఒక పిస్తోలు, రెండు మ్యాగ్జిన్లు, ఐదు బుల్లెట్లు, వారి ఫోన్‌లు, కారును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం శనివారం కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...