సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం


Sat,October 19, 2019 11:33 PM

-ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
అందోల్, నమస్తే తెలంగాణ: ప్రమాదవశాత్తు గాయపడిన వారికి, ఆరోగ్య సమస్యల ఉన్న వారికి కార్పొరేట్ దవాఖానలో మెరుగైన వైద్య సేవలను అందించడానికి సీఎం సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. శనివారం అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జోగిపేటలోని 10వ వార్డుకు చెందిన రెబ్బ నారాయణకు కాళ్లకు సర్జరీ నిమిత్తం ప్రభుత్వం మంజురు చేసిన రూ.లక్ష విలువ చేసే ఎల్‌వోసీ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన రెబ్బ నారాయణ రెండు కాళ్లకు సర్జరీ అవసరం కావడంతో, మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారని, 3 నెలల క్రితం రూ.2.15లక్షలను మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ నిధులతో ఒక కాలుకు ఆపరేషన్‌ను నిర్వహించగా, ప్రస్తుతం మరో కాలుకు ఆపరేషన్ కోసం రూ.లక్ష ఎల్‌వోసీ మంజూరు పత్రాన్ని నారాయణ కుటుంబ సభ్యులకు అందించామన్నారు. కుల, మతాలకతీతంగా పేద, నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి పథకం వరంలా మారిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి మంజూరుతో ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్‌రెడ్డి, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు చాపల వెంకటేశం, చేనేత సంఘం మాజీ అధ్యక్షుడు పడిగె సత్యం, నాయకులు గాజుల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...