టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడిగా సత్యనారాయణ


Fri,October 18, 2019 10:34 PM

కంది : టీఆర్‌ఎస్ సదాశివపేట మండల అధ్యక్షుడిగా పెద్దగొల్ల సత్యనారాయణ ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా విఠల్‌రెడ్డి, మాణిక్యం, రాములు, అంజన్న ఎన్నికవగా ప్రధాన కార్యదర్శిగా ఆరీఫోద్దీన్, కార్య నిర్వాహక కార్యదర్శిగా కొత్తగడి సురేష్, సంయుక్త కార్యదర్శులుగా అమర్‌నాథ్‌రెడ్డి, నర్సింహులు ఎన్నికయ్యారు. కోశాధికారిగా రాజు, సభ్యులుగా గన్నపురం పరమేశ్వర్, అప్సర్‌మియా, బిత్తిని ఈశ్వరయ్య, అమరేందర్‌రెడ్డి, అంజన్న, అబ్దుల్‌నాబి, మల్లేశం ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

టీఆర్‌ఎస్ మండల కమిటీ ఎన్నిక
కొండాపూర్ : టీఆర్‌ఎస్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మల్లేశం, ఉపాధ్యక్షులుగా రాందాస్, మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పట్లోళ్ల గోవర్ధన్‌రెడ్డి, కార్యదర్శులుగా చెక్య్రానాయక్, అజీమ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా సత్యానందం, వీరేశం, సత్యనారాయణరెడ్డి, గీత, బాలాగౌడ్, అంజిరెడ్డి, సుఖానంద్‌రెడ్డి, రత్నయ్య, శ్రీశైలాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. తమ ఎన్నికకు సహకరించిన మండల నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మండలంలో పార్టీని బలేపేతం చేస్తామని అన్నారు. మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...