మహిళల ఆధ్వర్యంలో శ్రమదానం


Fri,October 18, 2019 10:34 PM

సంగారెడ్డి రూరల్ : మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు శ్రమదానం నిర్వహించారు. ప్రతి శుక్రవారం కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా మహిళలంతా శ్రమదానంలో పాల్గొనాలని ఇచ్చిన ఆదేశాల పిలుపు మేరకు మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మండలంలోని ఇస్మాయిట్‌ఖాన్‌పేట, కల్పగూర్, ఫసల్‌వాది, కులబ్‌గూర్, హనుమాన్‌నగర్, తాళ్లపల్లి, కొత్లాపూర్, గౌడిచర్ల, గుడితాండ తదితర గ్రామాల్లో మహిళలు చెత్తాచెదారాన్ని తొలిగించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30రోజుల ప్రణాళికలో భాగంగా శ్రమదానం ఇక నుంచి ప్రతి శుక్రవారం నిరంతరంగా కొనసాగించడానికి మహిళలందరూ కంకణబద్దులై ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాల నాయకులు, ఏపీఎం వెంకట్, ఎంపీవో మహేందర్‌రెడ్డి, సీసీలు, కార్యదర్శులు, వీవోఏలు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...