రేషన్ బియ్యం పట్టివేత


Fri,October 18, 2019 10:34 PM

గుమ్మడిదల: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మండలంలోని కానుకుంట గ్రామానికి చెందిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. సివిల్ సైప్లె అధికారులు, ఎస్‌ఐ రాజేశ్‌నాయక్ తెలిపిన వివరాలు.. కానుకుంట గ్రామానికి చెందిన వ్యాపారి ఆగేశ్ అక్రమంగా రేషన్ బియ్యాన్ని డీసీఎం ద్వారా మార్కెట్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...