పట్టాలపై పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి


Fri,October 18, 2019 10:34 PM

రామచంద్రాపురం: ఎంఎంటీఎస్ తెల్లాపూర్ స్టేషన్ సమీపంలో రైల్వే పట్టాలపై పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. వికారాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ సాయిబాబా తెలిపిన వివరాల ప్రకా రం.. గుర్తు తెలియని వ్యక్తి గురువారం సాయంత్రం మద్యం మత్తులో తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రైల్వే ట్రాక్ వద్దకు వస్తూ పట్టాలపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయం తగిలి మృతి చెందాడు. కొమురంభీమ్ కాలనీలో ఆ వ్యక్తి సాయంత్రం సమయంలో మద్యం మత్తులో వెళుతున్న విషయాన్ని స్థానికులు గమనించారు. ఒంటిపై బ్లూ జీన్స్, తెల్లరంగు బనియన్ ఉంది. ఈ మేరకు వికారాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...