సేంద్రియ వ్యవసాయం చేయాలి


Fri,October 18, 2019 10:33 PM

కోహీర్ : సేంద్రియ వ్యవసాయంతో రైతులకు మేలు జరుగుతుందని ఎంపీపీ అధ్యక్షురాలు మాధవి తెలిపారు. శుక్రవారం మండలంలోని మాచిరెడ్డిపల్లి గ్రామాంలో బైఫ్ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాధవి మాట్లాడుతూ కషా యం తయారు చేసి పంటలపై పిచికారి చేయడంతో పంటలను ఎలాంటి తెగుళ్లు ఆశించవని వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు కషాయం తయారీ, కలుపు మొక్కల తొలిగింపు, మందు పిచికారి, నారు, విత్తనాలను నాటడంపై క్షేత్రస్థాయిలో వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ ఏసురత్నం, రాములు, బైఫ్ సంస్థ ప్రతినిధులు వినోద్, జయరెడ్డి, అనిత, నర్సింహులు, హర్షద్, అహ్మద్ అలీ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...