హరితహారం నిరంతర ప్రక్రియ..


Thu,October 17, 2019 11:28 PM

-మొక్కలు నాటి సంరక్షించాలి
-జిల్లాలో 3.65లక్షల మొక్కలను నాటాం..
-జహీరాబాద్‌లో రూ.7కోట్లతో అర్బన్ పార్కు
-కలెక్టర్ హనుమంతరావు
రామచంద్రాపురం : హరితహారం కేవలం వర్షాకాలంలోనే కాకుండా నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం భారతీనగర్ డివిజన్‌లోని ఈఎస్‌ఐ దవాఖాన రోడ్డులో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డితో కలిసి వారు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ హరితహారం వర్షాకాలంలోనే కాకుండా నిరంతరం కొనసాగించే కార్యక్రమమని అన్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 3.65లక్షల మొక్కలు 711కిలోమీటర్ల మేరా నాటడం జరిగిందని, ప్రతి మొక్కకు ట్రీగార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొక్కల సంరక్షణకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ సిబ్బందికి, క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. జహీరాబాద్‌లో రూ.7కోట్లతో అర్బన్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే ఆరు నెలల్లో పార్కు పనులు పూర్తికావడం జరుగుతుందన్నారు. నియోజకవర్గాల్లో 10నుంచి 15ఎకరాల భూమిని చూపించినట్లయితే అక్కడ కూడా అర్బన్ పార్క్‌లను ఏర్పాటు చేయిస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం జరిగిందని, ఇందులో భాగంగా స్థలాలను గుర్తిస్తున్నామని అన్నారు. లే ఔట్స్ చేసేవాళ్లు హరితహారం కోసం కొంత భూమిని ఖచ్చితంగా వదలాలని, అందులో పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సిందేనని తెలిపారు.

దోమల నివారణకు ప్రతి ఇంట్లో మరువం, దవనం, లక్ష్మీతులసీ, కల్యాణ తులసీ మొక్కలను కనీసం 20వరకు నాటుకోవాలని వాటితో దోమలు రావని చెప్పారు. కార్పొరేటర్లు సింధూఆదర్శ్‌రెడ్డి, అంజయ్యయాదవ్ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని, ఇంటింటికీ మొక్కలు అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారిని అభినందించారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ కాంక్రిట్ జంగల్‌గా మారిన మన ప్రాంతాన్ని పచ్చని మణిహారంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ప్రతి ఇంట్లో, ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వారు సూచించారు. చెట్లు ఉంటేనే భావితరాలకు మనుగడ ఉంటుందన్నారు. చెట్లు నరకడం మానుకుని పెంచడం అలవాటు చేసుకోవాలన్నారు. చెట్లు ఉంటేనే సకాలంలో వర్షాలు కురుస్తాయని, వాతావరణ కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు. హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చూడకుండా అన్నివర్గాల వారు పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని వారు వెల్లడించారు.

అనంతరం ఆర్సీపురం డివిజన్‌లోని ఉన్న గీతాభూపాల్‌రెడ్డి ప్రభుత్వం జూనియర్ కళాశాలను కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. కార్యక్రమంలో ఆర్సీపురం కార్పొరేటర్ అంజయ్యయాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుష్పనగేశ్, గ్రంథాలయ డైరెక్టర్ కుమార్‌గౌడ్, ఉప కమిషనర్ బాలయ్య, వార్డు సభ్యులు నర్సింహ, మోహన్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, బూన్, యూసఫ్, డివిజన్ల అధ్యక్షులు దేవేందర్‌చారి, పరమేశ్‌యాదవ్, ఆదర్శ్‌రెడ్డి, పాపయ్యయాదవ్, సత్యనారాయణ, నారాయణరెడ్డి, ఐలేష్‌యాదవ్, కుత్బుద్దీన్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...