ప్రైవేటు జూనియర్ కళాశాల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నర్సింహారెడ్డి


Thu,October 17, 2019 11:26 PM

అందోల్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రైవేటు జూనియర్ కళాశాల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జోగిపేట ఎస్‌ఆర్‌ఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కిషన్, కోశాధికారిగా బ్రహ్మచారిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేటు జూనియర్ కళాశాల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారామయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులను పలువురు జూనియర్ కళాశాలల అధ్యాపకులు అభినందించారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...