నెల రోజుల్లో వైకుంఠధామాలు పూర్తి చేయాలి


Thu,October 17, 2019 11:12 PM

పుల్కల్: ప్రతి గ్రామంలో డంపుయార్డు, వైకుంఠధామాలు నెల రోజుల్లో పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి మధుసూదన్‌రావు తెలిపారు. గురువారం ఎంపీపీ సమావేశ మందిరంలో ఎంపీడీవో విశ్వప్రసాద్ అధ్వర్యంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మండలంలోని అన్ని గ్రామాల్లో డంపుయార్డు, వైకుంఠధామాలను పూర్తి చేయాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు సూచించాడు. గ్రామంలో ప్రతి శుక్రవారం మహిళలతో, ప్రతి ఆదివారం యువకులతో శ్రమదానం చేయించాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతర కొనసాగాలన్నారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లు స్వచ్ఛ్ సర్వేక్షన్ బాధ్యతగా చేపట్టాలని సూచించారు. ప్రతి పంచాయతీకి ప్రతి నెల నిధులు విడుదలవుతాయని తెలిపారు. ఈ నిధులను సక్రమంగా పారిశుధ్యం,గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, సర్పంచ్‌లు రాధయ్య, రాజు, స్వాతి, అరుణ, వీరమణి, శ్రవణ్‌కుమార్, గోపాల్, నర్సింహారెడ్డి, లక్ష్మి పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...