తాగునీటి సమస్య లేకుండా చూడాలి


Thu,October 17, 2019 11:12 PM

-ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హెచ్‌ఎండబ్ల్యూ అండ్ ఎస్‌బీ (జలమండలి)ని కోరారు. గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నగరంలోని జలమండలి ఆఫీసుకు వెళ్లారు. జలమండలి ఎండీ దానకిశోర్‌ను కలిసి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని వినతి చేశారు. బొల్లారం మున్సిపాలిటీలో ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డుపై జంక్షన్ నుంచి నీటి కనెక్షన్ ఇవ్వడం ద్వారా 13 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. మెయింటనెన్స్‌కు ఇబ్బంది కలుగకుండా ఉంటుందని అన్నారు. బొల్లారం మున్సిపాలిటీలో పైప్‌లైన్ వేసేందుకు రూ.18కోట్ల వరకు ఖర్చు అవుతుందని, ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు.

బీరంగూడ కమాన్ నుంచి జంక్షన్ కనెక్షన్ ఇవ్వాలని అడిగారు. బీరంగూడ పరిధిలోని కాలనీల్లో తాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అమీన్‌పూర్‌లో బాలన్స్ పైప్‌లైన్ వేసేందుకు రూ. 90కోట్లు మంజూరు చేయాలన్నారు. పటాన్‌చెరు పట్టణంలో, రామచంద్రాపురం పట్టణంలో వాటర్ బిల్స్‌కు మినహాయింపు ఇవ్వాలన్నారు. కాలుష్య సమస్య కారణంగా భూగర్భజలాలు పాడైపోయాయని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు కూడా ఉచితంగా తాగు నీటిని అందజేయాలని ఆదేశించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే కోరిన పనులను పరిష్కరించేందుకు జలమండలి ఎండీ దానకిశోర్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో జలమండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...