బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలి


Thu,October 17, 2019 11:12 PM

వట్‌పల్లి: గ్రామీణ ప్రాంత ప్రజలు ఏపీజీవీబీ బ్యాంక్‌సేవలను వినియోగించుకోవాలని ఆర్‌బీఐ ఏజీఎం శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం ఖాదీరాబాద్ లో మర్వెల్లి ఏపీజీవీబీ ఆధ్వర్యంలో ఖాతాదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని తక్కువ వడ్డీకే రుణాలను అందించడం జరుగుతుందన్నారు. ఖాతాదారులు బ్యాం కుల ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడంతోపాటు కొద్ది మొ త్తంలో డిపాజిట్లు చేసుకుంటే బ్యాంక్‌ల నిర్వహణ మరింత బాగుంటుందన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది సంతోశ్‌కుమార్, సురేశ్‌బాబూ, సురజ్, సర్పంచ్ స్వర్ణలతారెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...