రక్తదానం చేయండి... జీవితాన్ని కాపాడండి


Thu,October 17, 2019 11:12 PM

-ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
సంగారెడ్డి టౌన్: రక్తదానం చేసి ఆపదలో ఉన్న జీవితాలను కాపాడాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డిలోని పోలీసు కల్యాణ మండపంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రక్త దాన శిబిరాన్ని ప్రారంభించి, రక్త దానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పలువురి ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందన్నారు. పోలీసు సిబ్బంది, పట్టణ యువకులు 42మంది ఈ మెగా రక్తదాన శిబిరంలో రక్తాన్ని దానం చేశారు. అనంతరం పట్టణంలోని కొత్త బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన పోలీసు కళా బృందం సభ్యులు పోలీసు అమర వీరుల త్యాగాలను కీర్తిస్తూ పాటలు పాడారు. ఈ కళాబృందం జిల్లా వ్యాప్తంగా పర్యటించి పోలీసు అమర వీరుల త్యాగాలను ప్రజలకు వివరించనున్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మహేందర్, ఏఆర్‌డీఎస్పీ అశోక్, ఎస్‌బీ సీఐ శ్రీనివాస్‌నాయుడు, ఆర్‌ఐ హరిలాల్, సంగారెడ్డి టౌన్ సీఐ వెంకటేశ్, రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్, జిల్లా ప్రభుత్వ దవాఖానలోని బ్లడ్ బ్యాంకు సిస్టర్ ఆర్.పూలమ్మ, ల్యాబ్ టెక్నీషియన్లు రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...