ప్రతి వారం పల్లె ప్రగతి పనుల పరిశీలన


Thu,October 17, 2019 12:00 AM

రాయికోడ్: మండల, గ్రామస్థాయి అధికారులు మూడు టీంలుగా ఏర్పడి ప్రతి బుధవారం పల్లె ప్రగతి పనులు పరిశీలిస్తారని ఎంపీడీవో స్టీవేన్‌నీల్ తెలిపారు. బుధవారం ఎంపీడీవో కాంప్లెక్స్ భవనంలో మండలంలో 30రోజుల ప్రణాళిక పనులపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండల, ఉపాధిహామీ అధికారులతో గ్రామాల్లో జరిగిన ప్రణాళిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతి పనులు నిరంతరం కొనసాగించాలని సూచించారు. గ్రామాలలో ఒక వారం మురుగు కాల్వలు శుభ్రం, ఒక వారం పిచ్చిమొక్కల తొలిగింపు, ఒకవారం హరితహారం, ఒకవారం స్వచ్ఛ గ్రామం తదితర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, విష్ణు, ఉపాధిహామీ అధికారులు ఉన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...