కాసాల రైతులతో ఆర్డీవో సమావేశం


Wed,October 16, 2019 11:59 PM

హత్నూర: మండలంలోని కాసాల శివారులో నుంచి కాళేశ్వరం ప్రధాన కాలువ నిర్మాణ పనులు చేపట్టనుండడంతో బుధవారం కాసాల గ్రామ రైతులతో సంగారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్ హత్నూర తాసిల్దార్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాసాలకు చెందిన 120మంది రైతుల భూముల గుండా కాళేశ్వరం ప్రధాన కాలువ నిర్మాణం చేపట్టనుండడంతో 97ఎకరాల భూమి కాలువలో పోతుందన్నారు. దీంతో రైతులకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ.9లక్షల10వేలు ధర నిర్ణయించగా రైతులు అంగీకరించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ జయరాం, కాసాల టీఆర్‌ఎస్ నాయకులు రాంచంద్రారెడ్డి, వెంకటేశంగుప్తా, రైతులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...