రయ్ రయ్


Wed,October 9, 2019 10:43 PM

-ఉమ్మడి జిల్లాలో సేవలందించి 485 బస్సులు
-ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖల సమన్వయం
-డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ నాయకుల నిరసనలు
-సంగారెడ్డిలో భిక్షాటన.., మెదక్‌లో అర్ధనగ్న ప్రదర్శన

సంగారెడ్డి టౌన్:జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న ఆర్టీసీ బస్సులు మాత్రం యథేచ్ఛగా రయ్ రయ్ మంటూ జిల్లాలో దూసుకుపోతునాయి. సమ్మె కారణంగా ఐదురోజులుగా ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో తాత్కాలిక పద్ధతిలో బస్సులు తిప్పేందుకు వచ్చిన తాత్కాలిక కార్మికులతో బస్సులను తిప్పారు. ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 8 డిపోల పరిధిలో 485 బస్సులు బుధవారం సేవలు అందించాయి. 325 ఆర్టీసీ బస్సులు, 160 ప్రైవేట్ (అద్దె ప్రాతిపదికన) బస్సులు సేవలు అందించాయి. విధుల్లో చేరిన కార్మికుల ద్వారా బస్సులను ఉమ్మడి జిల్లాలో సాయంత్రం వరకు 485 బస్సులు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాయి.

ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా..
ఉమ్మడి జిల్లా పరిధిలో సమ్మె కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రీజియన్ పరిధిలో 485 బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చారు. 325 ఆర్టీసీ బస్సులు, 160 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. రీజియన్‌లోని 8 డిపోల పరిధిలో మెదక్ డిపోలో 65 బస్సులు, నారాయణఖేడ్ డిపోలో 35 బస్సులు, సంగారెడ్డి డిపోలో 94 బస్సులు, సిద్దిపేట డిపోలో 86 బస్సులు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో 56 బస్సులు, జహీరాబాద్ డిపోలో 55 బస్సులు, దుబ్బాక డిపోలో 35 బస్సులు, హుస్నాబాద్ డిపోలో 50 బస్సులు ప్రయాణికులకు సేవలు అందించాయి. ప్రయాణికులు ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయిలో రీజియన్ పరిధిలో బస్సులను నడిపారు.

ఐదో రోజు కార్మికుల నిరసనలు..
సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉమ్మడి జిల్లాలోని 8 డిపోల ఎదుట నిరసనలు చేపట్టారు. మెదక్ జిల్లా కేంద్రంలో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అదేవిధంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జేఏసీ నాయకులు బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. వారికి సీఐటీయూ నాయకులు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులుల సమ్మెకు సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించి కొత్త బస్టాండు ఎదుట ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...