ఎమ్మెల్యేకు శుభాకాంక్షల వెల్లువ


Wed,October 9, 2019 10:42 PM

వట్‌పల్లి: దసరా పండుగ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అందోల్ నియోజకవర్గం చరిత్రలో ఎమ్మెల్యే ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉండడం ఇదే మొదటి సారి కావడంతో 8మండలాల్లోన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సంతోషాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యేకు జమ్మి ఆకు, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని మండలాల నేతలు బ్యాండ్ మేళాలు, డప్పు చప్పుళ్లతో పోతులబొగుడలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడంతో పోతులబొగుడ జనంతో కిక్కిరిసి పోయింది. పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులను పలకరిస్తూ ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...