ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బస్సులు నడపాలి


Wed,October 9, 2019 10:41 PM

సంగారెడ్డి టౌన్: ప్రజలకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఖమ్మం నుంచి అన్ని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు, రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులతో కమిటీలు వేసుకుని సమన్వయంతో బస్సులు విరివిగా నడిచే విధంగా చూడాలని, అవసరమైతే ప్రైవేట్ ఆపరేటర్లను నియమించుకుని ఆదరణాత్మకంగా అమలు చేయాలన్నారు. మెకానికల్ వర్కర్ల కోసం ఐటీఐ, డిప్లమా హోల్డర్లను నియమించుకోవాలని సూచించారు.

ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు వసూలు చేయరాదని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా బస్సు పాస్‌లు జారీ చేయాలని, అత్యవసర కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకు సాయం అందించాలని కలెక్టర్లలకు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా బస్సు డిపోల వద్ద, బస్టాండుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎటుంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి డిపోల నుంచి 83శాతం బస్సులు నడుపుతున్నామన్నారు. బస్సు స్టాండు, బస్సు డిపోల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు పెట్రోలింగ్, వీడియోగ్రఫీ చేస్తున్నామన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి అసంఘటిత సంఘటనలు జరుగలేదని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజశేఖర్, జిల్లా రవాణా అధికారి శివలింగయ్య, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...