మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య


Wed,October 9, 2019 10:41 PM

పుల్కల్: మద్యం మత్తులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కోర్పోల్ జరిగింది. ఎస్‌ఐ ప్రసాదరావు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం మండల పరిధిలోని కోర్పోల్‌కు చెందిన వడ్ల కనకాచారి(50) దసరా పండుగ రోజు మద్యం ఎక్కువగా సేవించిన కనకాచారి ఊరిలోని వెంకటేశ్వర దేవాలయం వద్ద చెట్టుపైకి ఎక్కి ఉరేసుకున్నాడు. దసరా రోజు రాత్రి కనకాచారి ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు వేతికిన కనిపించ లేదు. బుధవారం ఉదయం వెంకటేశ్వర దేవాలయం వద్ద కనకాచారి ద్విచక్ర వాహనం పార్కు చేసి ఉండడంతో రైతులు చెట్టుపై ఉరేసుకున్న దృశ్యాన్ని చూసి కనకాచారి కుటుంభ సభ్యులకు తెలిపారు. ఆయన భార్య ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...