అంబరాన్నంటిన దసరా సంబురాలు


Wed,October 9, 2019 10:41 PM

-పాల్గొన్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
అందోల్, జోన్ బృందం: దసరా పండుగను అందోలు నియోజవర్గ వ్యాప్తంగా మంగళవారం ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని అందోల్, పుల్కల్, రాయికోడ్, మునిపల్లి, వట్‌పల్లి, నర్సాపూర్‌లోని హత్నూర మండలాల్లో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. సాయంత్రం వేళల్లో ప్రజలు కొత్త బట్టలు ధరించి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలాల్లోని దేవాలయాలు, మండపాల్లో ప్రతిష్టించిన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. విజయ దశమి రోజున వాహనాలు, ఆయుధాలు, యంత్రపరికరాలకు పూజలు చేశారు. నియోజకవర్గ కేంద్రం జోగిపేట పట్టణంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎంపీపీ హెచ్.రామాగౌడ్, మాజీ ఎంపీటీసీలు పి.శివశేఖర్, ఎస్.సురేందర్‌గౌడ్, మార్కెట్ డైరెక్టర్ మల్లికార్జున్, రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు మల్లయ్య, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, గ్రామపెద్దలు ఆయుధాలకు పూజలు చేశారు. ఆర్య సమాజ్, వీరశైవలింగాయత్ ఆధ్వర్యంలో ఆయుధ ఊరేగింపును నిర్వహించి, ఎన్‌టీఆర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన జమ్మిచెట్టు వద్ద పూజలు చేశారు. జోగినాథ స్వామి ఆలయంలోని శివలింగాలను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో పాటు పలువురు నాయకులు, ప్రజలు స్వామి వారిని దర్శించుకున్నారు. మండల పరిధిలోని డాకూర్‌లో జడ్పీ చైర్ పర్సన్ పి.మంజుశ్రీ జైపాల్‌రెడ్డిని జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ.నాగభూషణంతో పాటు పలువురు పార్టీ నాయకులు కలిసి దసరా శుభాకాంక్షలు ఆమెకు తెలియజేశారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...