ఘనంగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు


Wed,October 9, 2019 10:41 PM

పాపన్నపేట: దసరా పండుగను పరస్కరించుకొని తొమ్మిది రోజుల పాటు ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధిలో జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాల్లో వన దుర్గాభవానీమాత వివిధ ఆకారాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. మొదటి రోజు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దుర్గాభవానీమాతకు పట్టు వస్త్రాలు సమర్పించి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. కాగా ఈ నెల 7న మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిచ్చిన వన దుర్గాభవానీ మాతను ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి దంపతులు దర్శించుకుని మూల విరాట్ వన దుర్గాభవానీమాతతో పాటు గోకుల్ షెడ్‌లో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో సైతం వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక చివరి రోజు విజయదశమిని పురస్కరించుకొని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వన దుర్గాభవానీ మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవీ ఉపాసకులు సనాతనశర్మ ఆధ్వర్యంలో పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఏడుపాయల ఈవో మోహన్‌రెడ్డి, ఆలయ సిబ్బంది రవికుమార్, సూర్యశ్రీనివాస్, సిద్దిపేట శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, మధుసూదన్‌రెడ్డి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఇందులో భాగంగా తొమ్మిది రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

పల్లకీసేవతో ముగిసిన ఉత్సవాలు
తొమ్మిది రోజుల పాటు కొనసాగిన శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం దసరా రోజున ముగిశాయి. ఇందులో భాగంగా దసరా పండుగను పురస్కరించుకొని మంగళవారం వేకువజామున అమ్మవారికి అభిషేకం, అర్చన, గణపతి పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వేద బ్రాహ్మణులు గోకులం షెడ్‌కి వెళ్లి అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరీదేవీగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని గోకుల్ షెడ్ నుంచి పల్లకీసేవ ద్వారా రాజగోపురం మీదుగా మంజీరా నదికి తరలించి పూజలు నిర్వహించి మంజీరానదిలో నిమజ్జనం చేశారు. ఈ పల్లకీసేవలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్లు విష్ణువర్ధన్‌రెడ్డి, నర్సింహులు, వేంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నాగసాన్‌పల్లి సాయిరెడ్డి, పోడిచన్‌పల్లి మాజీ సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

వనదుర్గాభవానీమాతను దర్శించుకున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
శరన్నవరాత్స్రోల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మూల విరాట్ వన దుర్గాభవానీ మాతను దర్శించుకున్ని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట ఈవో మోహన్‌రెడ్డి, ఆలయ సిబ్బంది, వేద బ్రాహ్మణులు ఉన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...