ప్రయాణం యథాతథం


Mon,October 7, 2019 11:09 PM

-ఉమ్మడి జిల్లాలో తిరిగిన 502 బస్సులు
-ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖల సమన్వయం
-డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ నాయకుల నిరసనలుఉమ్మడి జిల్లాలో తిరిగిన 502 బస్సులు
-ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖల సమన్వయం
-డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ నాయకుల నిరసనలు

సంగారెడ్డి టౌన్ : జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం కనిపించలేదు. మూడో రోజు కూడా ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో తాత్కాలిక పద్ధతిలో బస్సులు తిప్పేందుకు వచ్చిన తాత్కాలిక కార్మికులతో బస్సులను తిప్పారు. అధికారులు ముందస్తు ప్రణాళికలు చేయడం వల్ల ప్రజా రవాణాకు ఎక్కడా బ్రేక్ పడలేదు. ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 8 డిపోల పరిధిలో 672 బస్సలు ఉంటే అందులో 502 బస్సులు యథావిధిగా నడిచాయి. 332 ఆర్టీసీ బస్సులు, 170 ప్రైవేట్(అద్దె ప్రాతిపదికన) బస్సులు సేవలు అందించాయి. విధుల్లో చేరిన కార్మికుల ద్వారా బస్సులను ఉమ్మడి జిల్లాలో సాయంత్రం వరకు 502 బస్సులు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాయి.

పకడ్బందీ ప్రణాళికలు సక్సెస్..
ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె మెదక్ రీజియన్ పరిధిలో ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు చేయడం వల్ల ఇది సాధ్యమైందని అధికారులు వివరించారు. ఉదయం 5.00 గంటల నుంచే బస్సులు యథావిధిగా తిరిగాయి. తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు వచ్చిన డ్రైవర్లు, కండక్టర్లు బస్సులను తిప్పారు. మెదక్ రీజియన్ పరిధిలో ఆదివారం 502 బస్సులు తిరిగినట్లు ఆర్‌ఎం రాజశేఖర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులను తిప్పేందుకు రీజియన్ పరిధిలో 720 మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. సోమవారం కూడా తాత్కాలిక పద్ధతిలో పనిచేసే సిబ్బందితోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సులను నడిపారు. దసరా సందర్భంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుని 8 బస్సు డిపోల పరిధిలో 502 బస్సులను నడిపినట్లు ఆర్‌ఎం రాజశేఖర్ తెలిపారు.

ప్రజలను గమ్య స్థానాలకు చేర్చిన 502 బస్సులు..
ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రీజియన్ పరిధిలో 502 బస్సుల ద్వారా ప్రయాణీకులను వారి గమ్య స్థానాలకు చేర్చారు. 332 ఆర్టీసీ బస్సులు, 170 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. రీజియన్‌లోని 8 డిపోల పరిధిలో మెదక్ డిపోలో 62 బస్సులు, నారాయణఖేడ్ డిపోలో 41 బస్సులు, సంగారెడ్డి డిపోలో 97 బస్సులు, సిద్దిపేట డిపోలో 78 బస్సులు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో 71 బస్సులు, జహీరాబాద్ డిపోలో 70 బస్సులు, దుబ్బాక డిపోలో 30 బస్సులు, హుస్నాబాద్ డిపోలో 49 బస్సులు ప్రయాణికులకు సేవలు అందించాయి. ప్రయాణికులు ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయిలో రీజియన్ పరిధిలో బస్సులను నడిపారు.

డిపోల ఎదుట కార్మికుల నిరసనలు..
సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉమ్మడి జిల్లాలోని 8 డిపోల ఎదుట నిరసనలు చేపట్టారు. బస్సు డిపోల వద్ద మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలియజేశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జేఏసీ నాయకులు మోకాళ్లపై నడుస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. వారికి సీఐటీయూ నాయకులు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులుల సమ్మెకు సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించి కొత్త బస్టాండు ముందు ధర్న చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...