విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి


Mon,October 7, 2019 11:05 PM

హత్నూర : విద్యుత్‌షాక్‌తో కౌలురైతు మృతిచెందిన సంఘటన కాసాల గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు నాయికోటి జానయ్య(47), గ్రామ శివారులోని రెండెకరాల వ్యవసాయ పొలా న్ని కౌలుకు తీసుకొని వరిపంట సాగు చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన జాన య్య రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున జాన య్య సాగుచేస్తున్న పంటపొలం సమీపంలోని మరో పంట చేనుకు రక్షణగా కంచెను ఏర్పాటుచేసి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో విద్యుత్‌షాక్ తగిలి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య మాణెమ్మతోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ విషయమై ఎస్‌ఐ శ్రీనివాస్‌ను సంప్రదించగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...